మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఇఫ్టూ ప్రధమ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు తడి, పొడి చెత్త కార్మికుల జనరల్ బాడీ సమావేశంజరిగింది.ఈ సమావేశంలో ఇఫ్టూ జిల్లా కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి పాల్గొని మాట్లాడుతూ.. ఆదివారంనాడు ఇల్లందులో జరిగే ప్రథమ మహాసభను విజయవంతం చేయాలని మున్సిపల్ కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రఫీ, పాష, కుతాడి పద్మ, రామారావు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నా రు.