మన్యం న్యూస్, దమ్మపేట, ఏప్రిల్ 08: దమ్మపేట మండలం కేంద్రంలో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్దా కూడలిలో శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మండల ప్రధాన కేంద్రాలో టి సేవ కార్యక్రమం ద్వారా ప్రదర్శన కార్యక్రమం వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల పిలుపు మెరకు దమ్మపేట మండల కేంద్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు ముందుగా వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి అనంతరం ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సోయం మట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాయ మాటల ప్రభుత్వం అని యెద్దేవా చేసారు, ఎన్నికల హమీలలో నిరుద్యోగులకు ప్రతి నెల 3016/- ఇవ్వకపోగా, పోటి పరీక్షలకు సన్నద్దం అయ్యో నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యము మూలంగా టిఎస్పిఎస్సీ నుండి పలు పేపర్లు లీకేజీ కావడం టిఎస్పిఎస్సీ ఛైర్మన్, సభ్యుల పనితనం ఎమిటో అద్దం పడుతోందని దుయ్యబట్టారు. తక్షణమే వారినీ తొలగించాలని, చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తే తమ బ్రతుకులు బాగుపడతాయి అనుకున్నా నిరుద్యోగులు ఆశలను ఆదియశలు చేసింది అని మండిపడ్డారు. పేపర్ లీకేజీ వ్యవహారము అంతటికి బిఆర్ఎస్ పార్టీనే కారణం అని, పేపర్లు లీకేజీ వెనుక బిఆర్ఎస్ పార్టీ నాయకులు హస్తం ఉన్నదని, వారిని వెనుక నుండి నడిపిస్తోంది ప్రభుత్వంకు చెందిన పెద్దలు ప్రమేయం ఉన్నదని వారు ఆరోపించారు. ఇట్టి విషయంపై సిట్టింగ్ జడ్జితో తక్షణమే విచారణ జరపాల్సిన అవసరం ఉన్నాదని అన్నారు. అది మరవక ముందే తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రాలు కుడా లీకేజీ కావడం శోచనీయమైందని అటు బీజేపీ ఇటు బిఆర్ఎస్ దొంగ నాటకాలు అడుతున్నాయి అని, రెండు పార్టీలు వేరు వేరు కాదు కాదు తెలంగాణ రాష్ట్రం లో రాజకీయ స్వలాభం పెద్ద రాజకీయ నాటకం ఆడుతున్నాయని ఇది ప్రజలు నమ్మే స్థితి లో లేరని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు నింపడoలో విఫలం అయ్యాయని నిరుద్యోగులు పట్ల కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయుకులు కె శ్రీనివాసరావు, కె రాంబాబు, సోయం కృష్ణ, జి వెంకటేశ్వరావు మరియు విద్యార్థి విభాగం నాయుకులు, యాత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.