మన్యం న్యూస్, దుమ్ముగూడెం::
ఆయిల్ ఫామ్ సాగు వల్ల అధిక లాభం రైతులకు చేకూరుతుందని మేనేజర్ టి సుధాకర్ రెడ్డి తెలిపారు మండలంలోని చిన్న బండి రేవు గ్రామంలో మండల ఆదర్శ రైతు సాగి శ్రీనివాసరాజు తోటను క్షేత్రస్థాయి పర్యటన విచ్చేసిన మహబూబ్నగర్ జిల్లా కోయగూడెం గ్రామ రైతులు తో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022 23 ఆర్థిక సంవత్సరం పినపాక అశ్వాపురం దుమ్ముగూడెం చర్ల మండలంలో సుమారు 450 ఎకరాలు సాగు చేయడం జరిగిందని అదేవిధంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1000 ఎకరాలకు లక్ష్యంగా పెట్టుకొని సాగు చేస్తామని తెలిపారు అలానే మూడు సంవత్సరాల అనంతరం గెలలు దిగుబడి మొదలవుతుందని ప్రతి సంవత్సరం నాలుగు నుండి ఐదు టన్నుల వరకు దిగుబడి వస్తుందని తెలిపారు రైతులు ప్రభుత్వం కేటాయించిన కొనుగోలు కేంద్రంలో విక్రయించాలని వారికి రవాణా చార్జీలు కూడా ఫ్యాక్టరీ తో మాట్లాడి చార్జీలు వారే చెల్లించే విధంగా చేస్తామని తెలిపారు అనంతరం సాగి శ్రీనివాస్ రాజు తోటను 35 మంది రైతుల బృందం పరిశీలించి వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా డివిజనల్ మేనేజర్ ఈ బాలకృష్ణ ఫీల్డ్ ఆఫీసర్ ఫణి రాజేష్ రెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు