మన్యంన్యూస్,ఇల్లందు టౌన్:ఇల్లందు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సోదర, సోదరీమణులకు విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలోని సీఎస్ఐ, ఆర్సీయం, జేకెలోని జాన్సన్ చర్చిలలో ఉదయం అల్పాహారాన్ని అందించారు. ప్రార్దనల అనంతరం మధ్యాహ్నం సమయంలో క్రైస్తవులకు భోజన కార్యక్రమాన్ని మడత వెంకట్ గౌడ్ ప్రారంభించి స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా వెంకట్ గౌడ్ మాట్లాడుతూ…క్రైస్తవులు పరమ పవిత్రంగా భావించే ఈస్టర్ కు అల్పాహారం, భోజనం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, యేసుప్రభు ఆశీస్సులు పట్టణ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో పాస్టర్లు మడతను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మడత వెంట మాజీ కౌన్సిలర్ కమల్ కోరి, నాయకులు రాంజీ, సీహెచ్. రమేష్, రాజు, శశి, మంగళ్ సింగ్, అంజి సింగ్, అయితా సాయి తదితరులు పాల్గొన్నారు.
