మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 09: అశ్వారావుపేట పట్టణంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాల నందు ఆదివారం ప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు జన్మదినం సందర్భంగా అశ్వారావుపేట శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ఆదేశానుసారం మల్లాయిగూడెం సర్పంచ్, మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు నారం రాజశేఖర్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాల నందు రక్తదానం శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామూర్తి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ముందుగా రేగా బర్త్ డే సందర్బంగా కేకు కట్ చేసి స్వీట్లు పంపిణి చేశారు. అనంతరం ఏర్పాటు చేసినా రక్తదానం శిబిరంకు సుమారు 50 మంది పైనే రక్తం దానం చేసి మంచి మనసు చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, బిఆర్ఎస్ పార్టి మండల అధ్యక్షులు బండి పుల్లారావు, మండల నాయకులు మోహన్ రెడ్డి, బిర్రం వెంకటేశ్వరావు, మోటూరు మోహన్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.