మన్యం న్యూస్ చండ్రుగొండ ఏప్రిల్ 09: మండల పరిధిలోని గుర్రంగూడెం గ్రామంలో ఇటీవల తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాక మహేష్ దొర అనారోగ్యంతో మృతి చెందాడు. కాకా మహేష్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అశ్వరావుపేట మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్లు ఆదివారం వారి నివాసనికి వెళ్లి కాకా మహేష్ చిత్రపటానికి నివాళులర్పించి, వారి కుటుంబానికి రూ.20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాకా మహేష్ ఆదివాసి ఉద్యమంలో కీలకపాత్ర పోషించాడని, వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని ఆయన అన్నారు. ఆయన వెంట జెడ్పిటిసి కొణకండ్ల వెంకటరెడ్డి, ఎంపీటీసీ బోర్ర లలిత, కేశబోయిన నరసింహారావు, సంకా కృపాకర్, అంతటి రామకృష్ణ, ఇస్లావత్ రుక్మిణి, కుంచపు కన్నయ్య,, కొలికిపాక అప్పారావు, తదితరులు ఉన్నారు.