మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 8 సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ పార్టీని బొందపెట్టి మళ్లీ మొదటి నుంచి పాలను కొనసాగేందుకు బీఆర్ఎస్ పార్టీగా అవతారమెత్తిన కెసిఆర్ పాలనకు కొత్తగూడెం వేదికగా కౌంటడౌన్ స్టార్ట్ అయిందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనలో ఆయన బీఆర్ఎస్ పార్టీపై ధ్వజమెత్తారు. ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేయటమే కాకుండా కష్టపడి పని చేసేవాళ్లను పక్కనపెట్టి తానా అంటే తందానా అనే నాయకులను పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలకు రాష్ట్ర ప్రజలకు ఏ మేరకు న్యాయం చేశారు ప్రజాక్షేత్రంలో చెప్పాల్సి ఉంటుందని ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తన నాయకత్వంలో పదికి పది నియోజకవర్గాలను గెలిపించుకుని తీరుతామని సవాల్ విసిరారు. జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య మాట్లాడుతూ కొత్తగూడెం కేంద్రంగా విద్యానగర్ ప్రాంతంలో భూ కబ్జాజాలకు ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ భర్త, తండ్రి సీతారాములు పాల్పడుతూ నిరుపేద ప్రజలను అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారని ఇకనుంచి వారి ఆటలు సాగనివ్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పొంగులేటి వర్గీయులు పాల్గొన్నారు.