మన్యం న్యూస్,ఇల్లందు టౌన్ .. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులైన పులిగండ్ల మాధవరావుకు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు నాదెండ్ల శ్రీనివాసరెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పులిగండ్ల మాధవరావు మాట్లాడుతూ… స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ సిఫార్సు మేరకు తనను పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా నియమించిన రాష్ట్ర విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధిపతి అయిన రేగా కాంతారావుకు కృతజ్ఞతలు తెలిపారు.