UPDATES  

 సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్

  • సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్
  • రాబోయే రోజుల్లో ప్రజలందరి సహకారంతో గ్రామాలు మరింత అభివృద్ధి
  • ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్

మన్యం న్యూస్,ఇల్లందు రూరల్ ఇల్లందు మండలంలోని ఆజాద్ నగర్ వయా ఇంద్రానగర్ గ్రామంవరకు మూడు డీఎంఎఫ్టీ నిధుల నుండి మంజూరైన కోటి ఇరవైలక్షల రూపాయల నిధులతో రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం ఇల్లందు శాసనసభ్యురాలు భానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు సంబంధించిన గ్రామపంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపించడమే తన లక్ష్యమని అందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల చేతుల్లో నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన గ్రామాలు నేడు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రగతి విప్లవం కొనసాగుతోందని హరిప్రియ నాయక్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా గత కొన్ని నెలలుగా ఇల్లందు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన ,మరియు ప్రారంభోత్సవాల పరంపర కొనసాగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో మరింత అభివృద్ధి పథంలో ఇల్లందు నియోజకవర్గాన్ని ముందు వరుసలో ఉంచడానికి శాయశక్తులా కృషి చేస్తానని హరిప్రియ నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, జిల్లా అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవరావు, వైస్ ఎంపీపీ ప్రమోద్ కుమార్, డిసిసిబి డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు, పిఎసిఎస్ చైర్మన్ మెట్ల కృష్ణ, ప్రభుత్వ ఉన్నత అధికారులు, సీడీపీఓ ప్రసన్న, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హీరోలాల్, పంచాయతీ సెక్రెటరీ నీలిమ రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు ఘాజి, బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు మండల అధ్యక్షులు శీలం రమేష్, ఇల్లందు మండల ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటీ రేణుక, ఇల్లందు మండల పార్టీ ఇంచార్జ్ యల్లమద్ది రవి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ పూణేమ్ కమల, ఆత్మ కమిటీ చైర్మన్ బావు సింగ్, బాలాజీ నగర్ ఉపసర్పంచ్ మహబూబ్, మండల అధికార ప్రతినిధి మూడు హనుమ, బాలాజీ నగర్ వార్డ్ నెంబర్ శ్యామల , గ్రామ కో ఆప్షన్ నిమ్మల రాములు, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కుక్కుమూడి మహేష్, ఇల్లందు మండల ఉపాధ్యక్షులు డేరంగుల పోషము, ఇంద్రనగర్ వార్డ్ మెంబర్ నీలం రాజశేఖర్, ఇల్లందు మండల ఎస్సి సెల్ ప్రధాన కార్యదర్శి పూదుర్యి లక్ష్మీనారాయణ, యాకయ్య, బండ స్వాతి, స్వప్న, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !