మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :
ప్రతివారం జరిగే ప్రజావాణి కార్యక్రమం పరిష్కార వేదికగా కావాలని ప్రజలు అందించే దరఖాస్తుకు అధికారులు జవాబుదారీగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ సూచించారు.ప్రజా ప్రతినిధుల నుండి వచ్చిన సిఫారసు లేఖలు పరిష్కారంపై నివేదికలు అందచేయాలని తెలిపారు. సోమవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులు స్వీకరించి పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూప్రజాప్రతినిధులు సిఫారసు చేసిన 56 లేఖలు పెండింగ్ ఉన్నాయని, ఆయా శాఖల అధికారులు బుధవారం వరకు పరిష్కరించి నివేదికలు అందచేయాలని చెప్పారు. ఆయా శాఖల జిల్లా అధికారులుప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు.సమస్య పరిష్కరించాలని కోరారు.
ప్రజావాణిలో చేసిన దరఖాస్తులు కొన్ని::-
సుజాతనగర్ మండలానికి చెందిన తోకచిచ్చు సీతారామరాజు సర్వే నెం. 1497/ఈ/ఇ/2లో 2.09 ఎకరాలభూమి ఉన్నదని, అట్టి భూమికి సంబంధించి మాకు పూర్తి అధికారాలున్నాయని, భూమి తక్కువగా ఉన్నట్లు తమకుఅనుమానాలున్నాయని, సర్వే చేపించాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు కొరకు సుజాతనగర్ తహసిల్దార్కు ఎండార్స్
చేశారు.
బూర్గంపాడు మండలానికి చెందిన వంగూరి అరుణ, వంగూరి కామేశ్వరి డిగ్రీ వరకు చదువుకున్నామని,
ఉద్యోగాలు లేక కుటుంబ పోషణ కష్టంగా ఉన్నదని, తమకు దళితబంధు పథకం మంజూరు చేపించాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం ఎస్సీ కార్పోరేషన్ ఈడికి ఎండార్స్ చేశారు.
చుంచుపల్లి మండలం, రాంనగర్ గ్రామానికి చెందిన దామెర్ల వేణుమాధవ్ హైదరాబాదు నందలి నల్లమల్లారెడ్డిగటికేసర్, హైదరాబాదు ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేరియున్నానని, కరోనా వల్ల తరగుతులునిర్వహణ సరిగా లేకపోవడం, తెలుగుమీడియం నుంచి వచ్చిన తాను ఇంగ్లీషు మీడియంలో విద్యను అభ్యసించలేకపోవడం
వల్ల మొదటి సంవత్సరం అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యానని, ఇంజనీరింగ్ విద్య అభ్యసించలేనని, తన సర్టిఫికేట్లుఇప్పించాలని కోరగా, మిగిలిన మూడు సంవత్సరాల ఫీజులు చెల్లించాలని చెప్పారని, ఫీజులు చెల్లించలేని ఆర్థిక
పరిస్థితుల్లో ఉన్నామని తన సర్టిఫికేట్లు ఇప్పించాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు కొరకు కలెక్టరేట్ ఓఎస్టీకి ఎండార్స్ చేశారు.
పాల్వంచ మండలం, మంచికంటినరగ్కు చెందిన నునావత్ శ్రీరాం మంచికంటినగర్లోని ముత్యాలమ్మ గుడి దగ్గర నాలుగు సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నానని, విద్యుత్, నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని
కావున విద్యుత్, నీటి సౌకర్యం కల్పించాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం విద్యుత్ శాఖ అధికారులకు ఎండార్స్ చేశారు.
అన్నపురెడ్డిపల్లి మండలం, తొట్టిపంపు గ్రామానికి చెందిన వసంతరావు మరి కొందరు గిరిజన రైతులు గత 20 సంవత్సరాలుగా ఆర్డీఎస్ఆర్ భూముల్లో వ్యవసాయం సాగు చేస్తున్నామని, నీటి సౌకర్యం కొరకు సోలార్ ద్వారా బోర్లు
వేసుకున్నామని, అట్టి ఆర్డీఓఎస్ఆర్ పట్టా కలిగిన భూముల్లో ఆయిల్పామ్ సాగు చేయుటకు ప్రభుత్వ రాయితీతోఆయిల్ పామ్ మొక్కలు ఇప్పించాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం ఉద్యాన అధికారికి ఎండార్స్ చేశారు.
ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.