తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రెండు రాష్ట్రాలను నిప్పుల కుంపటిలా మార్చేశాడు. తెలంగాణలో నాలుగు రోజుల పాటు ఎండలు మండనున్నాయి.
ఈ నెల 13 వరకు ఉష్ణోగ్రతలు ఊహించని విధంగా పెరుగతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఇవాళ పెరిగితే.. మరి కొన్ని జిల్లాల్లో రేపట్నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవనున్నాయి. పలు జిల్లాలకు ప్రత్యేకంగా సూచనలు జారీ చేసింది. ఇవాళ 14 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా ఘన్‌పూర్‌లో 41.9 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయుడుపేటలో 41.8, నిర్మల్ జిల్లా దస్తురాబాద్‌లో 41.7 డిగ్రీలు నమోదయింది. 11న ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, 12, 13 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.
ఇక, అంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు ఉదయం 10 గంటలకే సెగలు పుట్టిస్తున్నాయ్. మండుతున్న ఎండలకు తోడు వడగాలులూ తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఐఎండీ అంచనాల ప్రకారం రేపు 26, ఎల్లుండి 69 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది విపత్తుల నిర్వహణ సంస్థ.. రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు 26 ఉన్నాయి.. అందులో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 1. అడ్డతీగల, 2. నెల్లిపాక , 3. చింతూరు, 4. గంగవరం, 5. రాజవొమ్మంగి, 6. వరరామచంద్రపురం ఉండగా.. అనకాపల్లి జిల్లాలలోని 7. కోటవురట్ల, 8. మాకవరపాలెం, 9. నర్సీపట్నం, 10. నాతవరం ఉన్నాయి.. తూర్పు గోదావరి జిల్లాలోని 11. రాజానగరం, 12. సీతానగరం, 13. గోకవరం, 14. కోరుకొండ.. ఏలూరు జిల్లాలోని 15. కుకునూర్ మండలం ఉన్నాయి.. ఇక, కాకినాడ జిల్లాలోని 16. గండేపల్లి,17. జగ్గంపేట, 18. కిర్లంపూడి, 19. కోటనందూరు, 20. పెద్దాపురం, 21. ప్రత్తిపాడు, 22. ఏలేశ్వరం.. పార్వతిపురంమాన్యం జిల్లాలోని 23. గరుగుబిల్లి, 24. జియమ్మవలస, 25. కొమరాడ, 26. వీరఘట్టం మండలాలు ఉన్నాయి.
ఇక, ఎల్లుండి వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాల సంఖ్య 69గా ఉన్నాయి.. అల్లూరి సీతారామరాజు జిల్లా 2, అనకాపల్లి 8, తూర్పు గోదావరి 6, ఏలూరు 3, గుంటూరు 3, కాకినాడ 4, కృష్ణా 1, నంద్యాల 1, ఎన్టీఆర్ 9, మన్యం 7, శ్రీకాకుళం 2, విశాఖ 1, విజయనగరం 13, వైయస్సార్ 9 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్‌బీఆర్ అంబేద్కర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.