మన్యం న్యూస్, భద్రాచలం :
జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తూ తిరుగుతున్న ముగ్గురు ఘరానా దొంగలను మంగళవారం భద్రాచలం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… భద్రాచలం పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో దొంగతనాలు జరుగుతున్నాయన సమాచారంతో భద్రాచలం పట్టణంలోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ ప్రాంతాల్లో భద్రాచలం ఏఎస్పీ పరితోస్ పంకజ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు భద్రాచలం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా భద్రాచలం పట్టణానికి చెందిన మాలోతు విక్రమ్, బండారి సాయి తేజ, సురిపాక నాగరాజు లను భద్రాచలం పోలీస్ లు సీసీ కెమెరాల సహాయంతో పసిగట్టి చాకచక్యంగా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించగా, భద్రాచలం పట్టణంలో చేసిన పలు దొంగతనాలు ఒప్పుకున్నారు. గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలలోని పలు దొంగతనాల కేసు లలో అరెస్టు కాబడి జైలు శిక్ష అనుభవించి ఇటీవలే బెయిల్ పై విడుదలైనట్లుగా తెలిసింది. అయినను వారి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకు తిరుగుతున్న దొంగలను చాకచక్యంగా అరెస్టు చేసిన భద్రాచలం పోలీసులను ఏఎస్పీ పారితోష్ పంకజ్ ఐపీఎస్ అభినందించారు. ఇట్టి కార్యక్రమంలో భద్రాచలం టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి, ఎస్ఐలు శ్రీకాంత్, మధు ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.