UPDATES  

 కోరం కనకయ్య నీ సవాలును స్వీకరిస్తున్నా * కనకయ్య నీకు దమ్ము ఉంటే నీ జడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి నాతో పోటీకి నిలబడి మాట్లాడు

  • కోరం కనకయ్య నీ సవాలును స్వీకరిస్తున్నా
  • * కనకయ్య నీకు దమ్ము ఉంటే నీ జడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి నాతో పోటీకి నిలబడి మాట్లాడు
    కొరంతో పోటీకి సిద్ధమన్న ఏఎంసీ చైర్మన్ హరిసింగ్ నాయక్
    నేను ఓడిపోతే నా భార్యతో సహా రాజకీయ సన్యాసం తీసుకుంటా నువ్వు ఓడిపోతే ఏం చేస్తావో నియోజకవర్గ ప్రజలకు బహిరంగంగా చెప్పాలని హరిసింగ్ నాయక్ డిమాండ్

బీఆర్ఎస్ పార్టీ విధానాలు నచ్చనప్పుడు ఇంకా జడ్పీచైర్మన్ హోదాలో ఎందుకు పార్టీలో కొనసాగుతున్నవు? నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి పోటీకి దిగు నేను రెడీ

పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక కుట్ర దారు…. కోరం కనకయ్య ఒక భూబకాసురుడు

 

మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:ఇల్లందు నియోజకవర్గ శాసన సభ్యురాలు భానోత్ హరిప్రియ నాయక్ మీద అదేవిధంగా వారి భర్త హరిసింగ్ నాయక్ మీద హరిప్రియ తండ్రి బాదావత్ సీతారాములు మీద కోరం కనకయ్య చేసిన అసత్య ఆరోపణలను ఖండిస్తూ మంగళవారం ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ హరిసింగ్ నాయక్ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ భానోత్ హరిసింగ్ నాయక్ మాట్లాడుతూ… హరిప్రియ తండ్రి బాదావత్ సీతారాములు భూమికి సంబంధించిన జడ్జిమెంట్ గురించి ఒకసారి నీ చెవులు పెద్దగా చేసుకుని వినాలని, ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్న నీవు ఆ భూమిపై కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లను, ప్రభుత్వం ఇచ్చిన జీవోలను చదువుకున్న వారితో చదివించుకొని వినాలని ఎద్దేవా చేశారు. హరిప్రియ తండ్రికి సంబంధించిన భూమి సమస్య 1994 నాటిదని, ఆనాడు హరిప్రియ నాయక్ ఎమ్మెల్యే కాదు అని, కేవలం విద్యార్థి మాత్రమే కదా అని ఆ భూమికి హరిప్రియకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. హరిప్రియ తండ్రికి సంబంధించిన భూమి జడ్జిమెంట్ 2016లో వచ్చిందని, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నది నువ్వే కదా..హరిప్రియ కాదు కదా అని వ్యాఖ్యానించారు. ఆ యొక్క భూమికి సంబంధించి అడిషనల్ ఏజెంట్ టు ది గవర్నమెంట్ వారు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పినప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న నీవు ఏం పీకావని ఘాటుగా స్పందించారు. అడిషనల్ ఏజెంట్ ఆఫ్ గవర్నమెంట్ ని ధిక్కరిస్తావు, ఎస్డీసీ కోర్టుని దిక్కరిస్తావు, హైకోర్టుని దిక్కరిస్తావు అని నువ్వు నిజమైన నాయకుడైతే ఇలా చేయవని అన్నారు. ఆనాడు బానోత్ సీతారాములు భూమి మీద కేసు వేసిన పాలడుగు కృష్ణారావు, గొలుసుల మల్లయ్య తమ తప్పుడు ఆధారాలతో ఐదు కోర్టులలో ఓడిపోవడంతో చేసేదేమీ లేక వెనుతిరిగిపోయారని, వారిని కూడా ప్రెస్ మీట్ లో కూర్చోపెట్టి నిజానిజాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. హరిప్రియ తండ్రి 1967 లోనే వాళ్ళ నాన్న తాలూకు భూమి ఇల్లందులోనే రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. అందులో నుండి 8 ఎకరాలను అమ్మి 18 ఎకరాలు, టేకులపల్లి నందు 22 ఎకరాలు, బాబు క్యాంపు వెంకటయ్యతండా వద్ద 7 ఎకరాలు నేటికీ అలాగే ఉన్నాయని ఆయన తెలియజేశారు. సీతారాములు 28 సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ.. చివరికి అన్ని న్యాయస్థానాల్లో గెలిచి పంచనామా చేసినటువంటి భూమి మీద నీ డేగకన్ను పడడంతో నువ్వు, నీ భార్య కోరం లక్ష్మీలు దాని చుట్టూ తిరుగుతూ దాని పక్కనే ఉన్న జిసిసి రాము ఎకరం భూమిని బలవంతంగా రాయించుకుంది మీరు కాదా అని దుయ్యబట్టారు. అందుకు సంబంధించిన కాగితం వాస్తవం అని, ఆ యొక్క కాగితం పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర లేకుంటే దానికి హరిసింగ్ నాయక్ పూర్తి బాధ్యత వహించి ఎంతటి చర్యకైనా సిద్దమని వెల్లడించారు. మరొక్కసారి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోరం కనకయ్యలు కొత్తగూడెం నందు గల 18 ఎకరాల భూమి గురించి మాట్లాడితే ఉపేక్షించేది లేదని అన్నారు. తల్లాడ నుండి పాలేరు వరకు రోడ్డుకిరువైపులా ఉన్న భూములను కబ్జా చేసి కాంట్రాక్టులను ఎగ్గొట్టి అన్యాయంగా సంపాదించిన పొంగులేటి నీతి నిజయతీల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. నీ భూదాహం ఇంకా తీరకపోతే నా తండ్రి నుండి వారసత్వంగా నాకు సంక్రమించిన 40 ఎకరాల భూమిని కూడా అందజేస్తానని తెలియజేసారు. దమ్ము ధైర్యం లేని కోరం కనకయ్యకు ఎమ్మెల్యేగా ఓడిపోయిన నాడు జెడ్పీటీసీ బీఫారంను నేనే అందించి గెలిపించామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ బిక్షగా వేసిన జడ్పీ చైర్మన్ హోదాలో కొనసాగుతూ ప్రభుత్వాన్ని విమర్శించటం సిగ్గులేని చవటలు చేసే పని అని, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పదవికి రాజీనామా చేసి అప్పుడు పోటీకి రావాలని పేర్కొన్నారు. ఆ మరుక్షణం నీతో పోటీకి నేను సిద్ధం అంటూ హరిసింగ్ నాయక్ సవాలు విసిరారు. పదవి మీద కక్కుర్తితో ఇప్పటికీ ఉన్న పదవిని వదులుకోలేక అదే పదవిలో కొనసాగుతూ ప్రభుత్వాన్ని వెక్కిరించడం బుద్ధిలేని పని అని అది నీ పదవీ వ్యామోహాన్ని తెలియజేస్తుంది అని విమర్శించారు. కోరం కనకయ్య ఇకనైనా నీ అసత్య ఆరోపణలు మానకంటే రానున్న ఎన్నికల తరుణంలో నియోజకవర్గ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఎవరినైతే చుస్కొని నువ్వు విర్రవీగుతున్నావో నీకు, పొంగులేటికి చెంపపెట్టు లాంటి సమాధానం ప్రజలే చెప్తారని అన్నారు. త్రివేణి విద్యాసంస్థలను స్థాపించి విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించామని, మా కళాశాలలలో చదువుకున్న వేలమంది విద్యార్థులు నేడు గొప్ప ఉద్యోగాలను పొంది హాయిగా జీవితాన్ని సాగిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ లోని టాప్ టెన్ విద్యాసంస్థల్లో త్రివేణి కూడా ఒకటని పేర్కొన్నారు. నిస్వార్థంగా సేవ చేస్తున్న తమపై నీ రాజకీయ స్వలాభం కోసం బురదజల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు. మరలా తమపై ఇటువంటి నిరాధార ఆరోపణలు చేస్తే కనకయ్యపై పరువునష్టం దావా వేస్తామని వెల్లడించారు.కోరం కనకయ్యకు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో డిపాజిట్ గల్లంతవ్వటం ఖాయమని, హరిప్రియ గెలుపును ఆపటం ఎవరివల్లా కాదని పేర్కొన్నారు. ఇంకోసారి తమపై, తమ కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పొంగులేటి, కోరం కనకయ్యల ఇళ్లను పదివేలమంది బంజారా సోదరులతో ముట్టడిస్తామని హరిసింగ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, పార్టీ పట్టణ అధికార ప్రతినిధి కుంట నవాబ్, భద్రాద్రి జిల్లా అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవరావు, టేకులపల్లి మండల అధికార ప్రతినిధి చీమల సత్యనారాయణ, టేకులపల్లి మండల నాయకులు కిషన్ నాయక్, ఇల్లందు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్ తివారి, పదకొండవ వార్డ్ కౌన్సిలర్ జేకే శ్రీను, ఇల్లందు పట్టణ ఉపాధ్యక్షులు పెండ్యాల హరికృష్ణ, ఇల్లందు పట్టణ, మండల పార్టీ ఇన్చార్జి సుధీర్ తోత్ల, యలమద్ది రవి, పట్టణ మహిళా అధ్యక్షురాలు నెమలి ధనలక్ష్మి, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !