UPDATES  

 సింగరేణి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి -ఎస్ ఓ టు జిఎం లలిత్ కుమార్

 

మన్యం న్యూస్ మణుగూరు టౌన్:ఏప్రిల్ 11

మణుగూరు సింగరేణి ఏరియా జిఎం కార్యాలయంలో ఏప్రిల్ 14 న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆర్ 132వ జయంతి మహోత్సవాన్ని సింగరేణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు చేయవలసిన ఏర్పాట్ల పై ఎస్‌ ఓ టు జి‌ఎం డి.లలిత్ కుమార్ అద్యక్షతన మంగళవారం సాయంత్రం సంబంధిత అధికారులు,సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయూస్ వెల్ఫేర్ అసోషియేషన్ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులతో ఎస్‌ఓ టు జి‌ఎం డి లలిత్ కుమార్ మాట్లాడుతూ,భారత రాజ్యాంగ నిర్మాత,భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం ప్రకారం నేటికీ మన దేశం ప్రజాస్వామ్యయుతంగా అభివృద్ది బాటలో నడుస్తుంది అన్నారు.భారత జాతి మొత్తం అంబేడ్కర్ కు ఎన్నటికీ ఋణపడి వుంటుంది అన్నారు.వారి జయంతిని దేశం మొత్తం ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా,కొనసాగుతుందన్నారు.అదే ఆనవాయితీని కొనసాగిస్తూ,సింగరేణి యాజమాన్యం అధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి ఉత్సవానికి ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగింది అన్నారు.ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం.రామ చందర్ ఆదేశం మేరకు సింగరేణి కాలరీస్ ఆద్వర్యం లో,సింగరేణి ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయూస్ వెల్ఫేర్ అసోషియేషన్ సౌజన్యంతో, గుర్తింపు సంఘం సహకారంతో ఏప్రిల్ 14న పీవీ కాలనీ అంబేడ్కర్ పార్క్ ఏరియాలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 132వ జయంతి భారీ ఎత్తున నిర్వహించేందుకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా అన్నీ రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలి అన్నారు.సింగరేణి కార్మికులు,అధికారులు వారి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనేలా విసృతంగా ప్రచారం చేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడంలో తమ వంతు సహకారం,అందించవలసిందిగా కార్యనిర్వాహక కమిటీ సభ్యులకు ఎస్‌ఓ టు జి‌ఎం డి. లలిత్ కుమార్ సూచించడం జరిగింది.ఈ సమావేశంలో, డి‌జి‌ఎం పర్సనల్ ఎస్.రమేశ్, ప్రాజెక్టు మేనేజర్ రాముడు, ఈ‌ఈ సివిల్ డి‌వి‌ఎస్‌ఎన్ ప్రవీణ్,ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయూస్ వెల్ఫేర్ అసోషియేషన్ భాద్యులు,సీనియర్ పర్సనల్ అధికారి రామేశ్వర్ రావు,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !