మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షుడు లోడే శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ములుగుజిల్లా ఇన్చార్జ్ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. మండల కార్యవర్గ సమావేశంలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఏప్రిల్ 15 న వరంగల్ కేంద్రంలో జరిగే నిరుద్యోగుల మిలియన్ మార్చ్ కి మండల పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి మండల పరిధిలో ఉన్నటువంటి జిల్లా కమిటీ నాయకులు మండల కమిటీ నాయకులు శక్తి కేంద్రం ఇన్చార్జులు బూత్ అధ్యక్షులు నిరుద్యోగుల తోటి యువకుల తోటి మాట్లాడి మిలియన్ మార్చ్కి తరలి వచ్చేలా ప్రోత్సహించాలని వారికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని నిరుద్యోగుల తరఫున పోరాడుతున్న బిజెపికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి లొంక రాజు, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు దండనపల్లి నరేందర్, మండల ఉపాధ్యక్షులు చీకట్ల యాకస్వామి, సాధన పెళ్లి సమ్మయ్య, మండల కార్యదర్శి జవంగుల రవీంద్ర, కోశాధికారి శ్రీనివాసచారి, మండల గిరిజన మోర్చా అధ్యక్షుడు కల్తీ రామకృష్ణ, మండల దళిత మోర్చా అధ్యక్షుడు రామటెంకి సమ్మయ్య, గిరిజన మోర్చా మండల నాయకులు లోడిగా మధుకర్,బూర నవీన్, ఈక సురేషు మొదలగు వారు పాల్గొన్నారు.
