UPDATES  

 ఇల్లందులోని కోరగుట్టను అధిరోహించిన ఏఎంసీ చైర్మన్ హరిసింగ్ నాయక్…. కోరగుట్టపై ఆంజనేయస్వామి భారీ విగ్రహ ప్రతిష్ఠకు నిర్ణయం

మన్యంన్యూస్,ఇల్లందు:ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరిసింగ్ నాయక్ పట్టణంలో ఉన్న కోరగుట్టను మంగళవారం ఎక్కారు. జై శ్రీరామ్ అంటూ రామనామ స్మరణ చేస్తూ ఎంతో ఎత్తులో ఉన్న కొరగుట్టను దాదాపు అరగంటపాటు శ్రమించి హరిసింగ్ నాయక్ ఈ గుట్టను అధిరోహించారు. ఈ సందర్భంగా హరిసింగ్ నాయక్ మాట్లాడుతూ…పట్టణంలోని కోరగుట్టకు విశేష ప్రాధాన్యమున్నట్లు తెలిపారు. ఈ కోరగుట్టపై ఆంజనేయస్వామి పాదం ఉన్నట్లు ఎప్పటినుంచో ప్రజల్లో నానుడి ఉన్నదని, ఆంజనేయస్వామి ఒక పాదం కొరగుట్టపై మరొక పాదం బయ్యరంలోని అడవిలో ఉన్న ఒక గుట్టపై ఉన్నట్లు పేర్కొన్నారు. గతంలో ఎంతోమంది కోరగుట్టపై ఉన్న స్వామివారి పాదాన్ని చూసారని తెలిపారు. ఈ నేపథ్యంలో పట్టణంలో ఎంతో ఎత్తులో ఉన్న ఈ గుట్టపై ఆంజనేయ స్వామి పాదం ఉన్న సమీపంలో స్వామివారి భారీ విగ్రహ ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోకి ప్రవేశించే ప్రతీఒక్కరికి ఈ భారీ ఆంజనేయస్వామి విగ్రహం దర్శనమిచ్చేలా భారీ ఎత్తుతో అలాగే ఈ ప్రదేశాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకే ఈ విధంగా చేయనున్నట్లు హరిసింగ్ నాయక్ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ అధ్యక్షులు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి పర్చురి వెంకటేశ్వరరావు, సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారపు రాజేష్, మాదిగ జేఏసి నాయకులు మేకల శ్యామ్, మండల వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్ కుమార్, నాయకులు హరికృష్ణ, నబీ తదితరులు ఉన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !