మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దీనజన బాంధవుడు, సమసమాజ స్థాపనలో భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని ఇల్లందు మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఇల్లందు మున్సిపల్ ఛైర్మెన్ డీవీ, మున్సిపల్ కమిషనర్ అంకుషావలి జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో డీవీ మాట్లాడుతూ… బడుగు బలహీన కోసం , దళిత మహిళల అభ్యున్నతికై పాటుపడిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. నేటి యువత పూలేని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు మరియు కమిషనర్ అంకు షావలి పాల్గొన్న అకౌంట్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఐ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, జూనియర్ అసిస్టెంట్లు, జవాన్లు, ఆఫీసు ఇబ్బంది, తదితరులు పాల్గొన్నారు.