- శభాష్ సరస్వతి…
- అంతర్జాతీయ ఏసియన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో…
- కొత్తగూడెం విద్యార్థికి బంగారు పతకం
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ఇటీవల గోవా లో జరిగిన మూడవ అంతర్జాతీయ ఏషియన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం మేదరబస్తీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 9 వ తరగతికి చదువుతున్న విద్యార్థిని కే సరస్వతి. బంగారు పథకం సాధించినట్లు.కరాటే కోచ్ వై ఉషారాణి అన్నారు . ఈ మేరకు మంగళవారం మేదర బస్తి ఉన్నత పాఠశాలలో విద్యార్థినికి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం మంజుల మాట్లాడుతూ క్రీడలు అనేవి మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని గోవాలో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ఏషియన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో తమ పాఠశాలకు చెందిన సరస్వతి బంగారు పథకం సాధించడం ఎంతో అభినందనీయమన్నారు . కరాటే లో పథకం సాధించడం పట్ల కోచ్ ఉషారాణి కృషిని అభినందిస్తున్నామన్నారు . భవిష్యత్తులో విద్యార్థిని మరిన్ని పథకాలు సాధించి పాఠశాలకు తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్ , ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు