- కార్యకర్తలే బలం… బలగం
- దేశానికే దిక్సూచి సీఎం కేసీఆర్
- కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి కంటికి రెప్పలా కాపాడుకుంటాం.
- సంక్షేమం అభివృద్ధి పై చర్చ జరగాలి
- పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులు
- మూడోసారి బిఅర్ఎస్ పార్టీదే అధికారం
- పినపాక మండలం ఆత్మీయ సమ్మేళనలో రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు*
- కొమ్ము డ్యాన్స్,బతుకమ్మ నృత్యాలతో ఘన స్వాగతం
మన్యం న్యూస్ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని రాళ్ల వాగు వద్ద పినపాక మండలం బిఅర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిఅర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటి పురపాలక శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన మొదటి విడత 12 గ్రామపంచాయతీల ఆత్మీయ సమ్మేళ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు హాజరయ్యారు,దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం చేశారు. కళాకారులు ఆటపాటతో కార్యకర్తలతో నూతనోత్సాహాన్ని నింపారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై గ్రామ గ్రామాన చర్చ జరగాలని ఆయన అన్నారు.పార్టీ అనుబంధ గ్రామ కమిటీలు పటిష్టతకు అంకితభావంతో పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో 12 లక్షల మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.1,00,116 ఆర్థిక సాయం చేసి పేదలను ఆదుకున్నామన్నారు. 66 లక్షల రైతు కుటుంబాలకు రూ.17 వేల కోట్లను రైతుబంధు ద్వారా వారి అకౌంట్లో జమ చేశామని గుర్తు చేశారు.కార్యకర్తలు పార్టీకి పట్టుగొమ్ములని గ్రామాలలో సైనికుల పనిచేయాలని ఆయన అన్నారు.9 ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికి వెళ్లివివరించాలనిసూచించారు.లబ్ధిదారులతో ప్రతీ కార్యకర్త మాట్లాడాలన్నారు.పేదల అభ్యున్నత కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది అన్నారు.సొంత జాగా ఉన్న వారికి త్వరలోనే ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయలు ఇస్తుంది అన్నారు, నియోజకవర్గానికి 3,000 ఇల్లు మంజూరు చేసి ప్రభుత్వం త్వరలోనే జీవో జారీ చేయనుంది అన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.బిజెపి పాలిత రాష్ట్రాలలో కంటే తెలంగాణ అన్ని రంగాలలో ముందు వరుసలో నిలుస్తుంది అని పేర్కొన్నారు.సాగు రంగానికి లక్షల కోట్లు ఖర్చుపెట్టి రైతన్నకి అండగా ఉంటున్నారని పేర్కొన్నారు.ఈ పరిస్థితులలో దేశ ప్రజలు బిఅర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారన్నారు. కార్యకర్తలకు కష్టం వస్తే తనను సంప్రదించాలని సూచించారు.కార్యకర్తలు నాయకులు రెట్టింపు ఉత్సవంతో పనిచేయాలని సూచించారు.ఇంటింటా సంక్షేమ పథకాలు మిషన్ భగీరథ నీరు అందుతుంది అన్నారు.పల్లెలు పట్టణాలలో ఎంతో మార్పు వచ్చింది అన్నారు.వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారని పేర్కొన్నారు. అందుకే యావత్ దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. మూడోసారి ముచ్చటగా బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పినపాక మండలం బిఆర్ఎస్ పార్టీ ప్రజ ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, అభిమానులు,యువజన నాయకులు,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.