UPDATES  

 విద్య సముపార్జన ద్వారానే అభివృద్ధి

  • విద్య సముపార్జన ద్వారానే అభివృద్ధి
  • అనగారిన వర్గాలలో అక్షర జ్యోతిని వెలిగించిన మహనీయుడు పూలే …జిల్లా కలెక్టర్ అనుదీప్

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

విద్యా సముపార్జన ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమని భావించి అణగారిన వర్గాల్లో అక్షరజ్యోతిని వెలుగించినమహానీయుడుమహాత్మాజ్యోతిరావుపూలే అని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే197వజయంతినిపురస్కరించుకుని మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హలులో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆద్వర్యంలో
నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈసందర్భంగా ప్రజలకు మహనీయుని జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అక్షరాలను ఆయుధంగా చేసుకుని అణగారిన
వర్గాల విద్యాభివృద్ధికి కృషి చేసిన మహానుభావుడు జ్యోతిరావుపూలే అని చెప్పారు. స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజంఅభివృద్ధి సాధ్యం కాదని భావించిన జ్యోతిరావు పూలే నిరక్షరాసురాలైన తన భార్య సావిత్రిబాయి పూలేకు విద్యాబుద్ధులు
నేర్పించి ఉపాద్యాయురాలిని చేశారని చెప్పారు. పూలే విలువలకు కట్టుబడి దేశానికి, సమాజానికి ఎనలేని సేవలుఅందించారని కొనియాడారు. ప్రజలకు ఆర్థికపరమైన మార్పు కంటే సామాజిక పరమైన మార్పు చాలా అవసరమనిమానవాళికి గొప్ప సందేశం అందించారని అన్నారు. బానిసత్వపు ఆనవాళ్లున్న నాటి సమాజంలో తన సామాజిక
చింతన ద్వారా సమతా వికాసం కోసం కృషి చేశారని చెప్పారు. ఆనాడు ఎంతో వివక్ష ఉండేదని, ఆనాటి సమాజంలోచెడును చెడుగా గుర్తించేందుకు విద్య అవసరమని భావించి విద్యాదానం చేశారని చెప్పారు. అసమానతలు లేని సమసమాజం కోసం పూలే చేసిన కృషి ఎంతో గొప్పదని, అటువంటి మహానీయుల త్యాగాలను ఒక్కరోజే కాదు ప్రతి రోజు
తలచుకోవాలని తెలిపారు. విద్య మాత్రమే మనిషిని ఉన్నతస్థాయికి చేర్చగలదని, నేను నేడు ఈ స్థాయిలో ఉన్నానంటేఅందుకు కారణం విద్యేనని చెప్పారు. విద్య ద్వారానే ప్రగతి సాధన జరుగుతుందని విశ్వసించిన మహానీయుడు పూలే
అన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలేను తన గురువుగా పేర్కొన్నారని అన్నారు జ్యోతిరావుపూలేఆశయాల సాధనలో భాగంగా బడుగు, బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎస్సీ,
ఎస్టీ, బిసి, మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి విద్యాబోధన చేస్తునట్లు చెప్పారు. తింటూ కూర్చుంటే కొండలైన కరిగిపోతాయని, విద్య మాత్రం పంచిన కొలది రెట్టింపు అవుతుందన్నారు.. నేడు ప్రభుత్వం సంక్షేమానికి ఎంతోప్రాధాన్యత ఇస్తున్నదని, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అర్హుల దరికి చేర్చి వారి అభివృద్ధికి మనం కృషిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. గురుకులాల్లో తమ పిల్లలకు సీట్లు ఇప్పించాలని ప్రజావాణిలో దరఖాస్తులు
ఇస్తున్నారని, గురుకులాల్లో మంచి విద్యాబోధన జరుగుతున్నట్లు చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వంకళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాలతో వివాహ ఖర్చులకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. రాజ్యాంగ బద్ధమైనహక్కుల ఉల్లంఘన జరుగకుండా తగిన న్యాయం చేయుటకు జిల్లా యంత్రాంగం అవిశ్రాంత కృషి చేస్తున్నట్లు చెప్పారు.
మనందరం ఐకమత్యంతో సమిష్టిగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి సమ సమాజ స్థాపనలో భాగస్వాములంకావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, బిసి సంక్షేమ అధికారి సురేందర్, డిఆర్డీ అశోక్ చక్రవర్తి,ఉత్సవ కమిటీ ఛైర్మన్ రెడ్డిమళ్ల వెంకటేశ్వరావు, సభ్యులు మాడిశెట్టి శ్రీనివాసరావు, శంకర్, కిషోర్, రాజేశ్వరి, కె. సత్యనారాయణ,
బిసి సంక్షేమ సంఘం నాయకులు బండి రాజుగౌడ్, భూపతి శ్రీనివాసరావు, కట్కూరి రవి, కె. రామాచారి, గుమలాపురంసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !