మన్యంన్యూస్,ఇల్లందు:బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలను ఇల్లందులోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పూలే జయంతి సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది కేక్ కటింగ్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లారెడ్డి పాల్గొని మాట్లాడుతూ…జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలను హాస్పిటల్ ఆవరణలో జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికై అనేక పోరాటాలు చేసిన మహనీయుడు పూలే అని పేర్కొన్నారు. మహారాష్ట్రలో దళిత కుటుంబంలో జన్మించిన పూలే ఆనాడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న తరుణంలో నిమ్నవర్గాల ప్రజలను అంటరానివారిగా దూరం పెట్టడ్డాన్ని చూసి చలించిపోయారని పేర్కొన్నారు. అంతేగాక బడుగువర్గాల మహిళలను చదువుకోనివ్వకుండ ఇంటికే పరిమితం చేసే ఆరోజుల్లో పూలే బడుగు వర్గాల మహిళలకోసం పాఠశాలలను ప్రారంభించటం జరిగిందని తెలిపారు. బడుగు,బలహీన వర్గాల కోసం,మహిళలు చదువుకోవాలని, సమాజంలోని అసమానతలు తొలగిపోవాలని సమసమాజం కోసం,భవిష్యత్తు తరాలకోసం ఎన్నో కార్యక్రమాలు, పోరాటాలు చేసిన మహనీయుడు పూలే అని ఆయన గొప్ప విప్లవ సంఘ సంస్కర్త అని సూపరింటెండెంట్ మల్లారెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు జగన్మోహన్, విక్రమ్, శ్రీకాంత్, మ్యాట్రిన్ సౌభాగ్యవేణి, నర్సులు విజయ, అనిత, కార్యాలయ విభాగంలో పనిచేసే స్వరూపారాణి, సర్కార్, ఎక్స్ రే టెక్నీషియన్ కృష్ణమూర్తి, ల్యాబ్ టక్నీషియన్ చంద్రకళ, హాస్పిటల్ పిట్ సెక్రెటరీ జాఫర్, వార్డ్ బాయ్స్ చాంద్ పాషా, సలీం, మెహబూబ్, బదిలీ వర్కర్లు ఉషా, శ్వేత, కల్యాణి, కాంట్రాక్టు కార్మికులు పెద్ద వెంకటేశ్వర్లు, రాము, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
