మన్యం న్యూస్ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిట మట రఘు ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 196వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ.మాత్మ జ్యోతిరావు పూలే అంటరానితనం సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలన మహిళల ఉన్నతికై బడుగు బలహీన వర్గాల ప్రజలు పొందడానికి సత్య శోధక్ సమాజ్ స్థాపించి అణగారిన వర్గాల ఉన్నతి కోసం కృషి చేసిన మహానీయుడు సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ టౌన్ అధ్యక్షులు సరికొప్పుల శ్రీనివాస్,మండల సీనియర్ నాయకులు మామిడి రాంబాబు,సాధన పల్లి లక్ష్మయ్య నెగరికంటి ముతేష్, సోదరి హరీష్,వలస మొండయ్య,తదితరులు పాల్గొన్నారు.
