మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరగడం పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారంతో 10వ తరగతి పరీక్షలు పూర్తి కావడంతో జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ జిల్లా కలెక్టర్ కు పుషగుచ్ఛం అందించి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు నిర్వహణపై పలు సమీక్ష సమావేశాలు నిర్వహించి ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు కానీ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా నిర్వహించుటకు జారీచేసిన ఆదేశాలను విద్యాశాఖ అధికారులు తు.చ. తప్పక పాటించారని ఆయన పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన అన్ని శాఖల అధికారులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ మాధవరావు, పర్యవేక్షకులు జ్యోతి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.