- ఆదివాసి ఇలవేల్పు జాతరలను రక్షించు కుందాం
- కారు కొండ సడలమ్మ జాతరను విజయ వంతం చేయండి.
- *తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి.అరుణ్ కుమార్.
మన్యం న్యూస్ ఏటూరు నాగారం
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని అన్నారం పట్టి,భూపతి పూర్ లో ఈనెల 12, నుంచి15 తేదీ వరకు జరుగు బేరంబోయిన వంశం 6 వ గొట్టు కి సంబంధించిన శ్రీ కారుకొండ సడలమ్మ జాతరను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తల్లుల దీవెనలు పొందాలని అదే విధంగా అంతరించి పోతున్న ఆదిమ తెగల సంస్కృతి సాంప్రదాయాల రక్షణ కోసం పాటు పడాలని తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు.పూర్వం అన్నారం గడి రాజ్యం లో కోయ రాజ్యాల పరిపాలనలో జాతర ఘనంగా నిర్వహణ జరిగేదని అన్నారు.తదుపరి రజ కార్ల కాలంలో ఈ రాజ్యం
కోల్పోయాక జాతర వెనుక పడి పోయిందని అన్నారు.నేటికీ గడి బావి కోట ఆధారాలు సజీవంగా ఉన్నాయని అన్నారు.యెట్టి మూలం నుంచి విబజించబడిన,మైపతి,కుడుముల,దన్నూరి,అన్నారం, కోఫిపే,ఆత్రం,ఇంటిపేరు గల వారు ఈ మూలం క్రిందకు వస్తారని అన్నారు.పూర్వం మహారాష్ట్ర లోని ఆహెరి గోండు రాజ్యం వరకు,బస్తర్ ఛత్తీస్ ఘడ్ ప్రాంతం వరకు మొత్తం ఈ వేల్పు జాతర పడిగ లు కాలి నడకన పోయేవి అని అన్నారు.ఈ జాతర మూలం పెద్ద మూలం అని అన్నారు. కాల క్రమంలో లో అన్నారం రాజ్యం కోల్పోయిన తరువాత మూలం వెనుక పడిపోయింద ని అన్నారు.ఆదివాసి సంస్కృతి రక్షణ లో బాగంగా వేల్పు జాతర ల చరిత్ర లను బయటికి తీస్తున్నట్లు తెలిపారు.గోదావరి నదిలో పవిత్ర గంగా స్నానం పూర్తి చేసుకున్న దేవర,గుట్ట నుండి పకృతి రూపం లో వచ్చిగద్దె లు చేరుతుందని అన్నారు.ఈ జాతర సందర్భంగా క్రీడల నిర్వహణ కూడా చేస్తున్నట్లు తెలిపారు.ఆదివాసి యువత క్రీడలతో పాటు స్మృతి రక్షణ లో ముందు ఉండాలని అన్నారు.ఈ కార్య క్రమంలో కారు కొండ సడలమ్మ జాతర నిర్వహణ కమిటీ అధ్యక్షులు బడే రాంబాబు,ఉపాధ్యక్షులు బచ్చలి వెంకటేష్,దన్నురి పోతురాజు,పూజారులు యెట్టి మహేష్,ప్రకాష్,వెంకటేష్,వడ్డెలు కిరణ్,ఆదివాసి నాయకులు పాయం కళ్యాణ్,తాటి నవీన్ తదితరులు పాల్గొన్నారు.