మన్యం న్యూస్ చండ్రుగొండ ఏప్రిల్ 11 : మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి వేడుకలు మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వేడుకలు సందర్భంగా పూలే చిత్రపటానికి ఎంపీపీ బానోత్ పార్వతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బస్టాండ్ సెంటర్లో జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ… అణగారిన వర్గాల కోసం జ్యోతిరావు పూలే అనేక పోరాటాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ధారా వెంకటేశ్వరరావు , జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు భూపతి శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, బిఆర్ఎస్ మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు దారా బాబు, ఉప్పతల ఏడుకొండలు, సీనియర్ నాయకులు మేడా మోహన్ రావు, నల్లమోతు వెంకటనారాయణ,భూపతి రమేష్, సత్తి నాగేశ్వరరావు, గుగులోత్ ప్రవీణ్ ప్రకాష్, పోచం హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.
