UPDATES  

 ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిపై కుక్కలు స్వైర విహారం

  • ఐదేళ్ల చిన్నారిపై కుక్కల దాడి.. తీవ్రమైన గాయాలు
  • తృటిలో తప్పించుకున్న చిన్నారి
  • జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు
  • కుక్కలు నియంత్రణకు చేతులెత్తేసిన మున్సిపల్ అధికారులు

ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిపై కుక్కలు స్వైర విహారం చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ 16వ వార్డు రాజీవ్ గృహకల్ప సముదాయంలో మంగళవారం చోటుచేసుకుంది. రాజీవ్ గృహకల్ప దగ్గర ఐదు సంవత్సరాల చిన్నారి జెర్సీ ఇంటిముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కలు గుంపు ఆ చిన్నారి మీద పడి తీవ్ర గాయాలు చేశాయి. కుక్కలు చిన్నారి మెడ బాగాన తీవ్రంగా గాయపరచడం తో పాటు శరీర భాగాల్లో కూడా కరిచాయి. రక్తశ్రావంతో కొట్టుమిట్టాడుతున్న చిన్నారి కుక్కలతో పెనుగులాడుతూ చాకచక్యంగా బయటపడింది. ప్రాణప్రాయం నుంచి తప్పించుకుంది. ఇది గమనించిన చిన్నారి తల్లిదండ్రులు హుటాహుటిన కుక్కలను తరిమి వేయడంతో పాటు గాయాలు పాలైన తన కుమార్తెను హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుతుంది. ఇదిలా ఉంటే కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడాలని ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు చేతులు జోడించి ప్రాధేయపడుతున్నప్పటికీ పట్టించుకోకపోవడం వారి విధులు పట్ల నిర్లక్ష్యాన్ని కొట్టి వచ్చినట్టు కనపడుతుందని ప్రజలు ఆగ్రయిస్తున్నారు. కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే కొత్తగూడెం మున్సిపాలిటీ పలు వార్డుల్లో కుక్కలు తీవ్ర స్థాయిలో స్వైర విహారం చేస్తున్నప్పటికీ వాటిని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు అర్థం కావడం లేదని ఆరోపిస్తున్నారు . కుక్కల బెడద నుంచి ఎవరికైన ప్రమాదం జరిగితే మున్సిపల్ అధికారులే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !