మన్యం న్యూస్ కరకగూడెం:భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే పోదేం వీరయ్య ఆదేశాల మేరకు జిల్లా మహిళా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న చేతుల మీదుగా కరకగూడెం మండల మహిళా అధ్యక్షురాలుగా చందా వెంకట రత్నమ్మ ను నియమిస్తూ నియామక పత్రం అందచేశారు.ఈ సందర్బంగా కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ మండల మహిళా అధ్యక్షురాలుగా చందా వెంకట రత్నమ్మ ని నియమించడం సంతోషకరమైన విషయమని,చందా వెంకట రత్నమ్మ పార్టీ కోసం అహర్నిశలు కస్టించినందుకు గాను పార్టీ అధిష్టానం ఆమె శ్రమని గుర్తించి మహిళా అధ్యక్షురాలుగా నియమించినందున జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవి ప్రసన్న కి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ కో ఆర్డినేటర్ కాటిబోయిన నాగేశ్వరరావు,బీరం సుధాకర్ రెడ్డి, బూర్గంపహాడ్ మండల అధ్యక్షులు దుర్గంపూడి క్రిష్ణారెడ్డి,నియోజకవర్గం మహిళా నాయకురాళ్లు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
