మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యంత ప్రజాభిమానం కలిగినటువంటి మా అభిమాన నాయకుడు, ప్రజానేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం సరైన విధానం కాదని పట్టణ నాయకులు బోల్ల సూర్యం అన్నారు. ఈ మేరకు జేకేలోని కోరం క్యాంప్ కార్యాలయంలో బుధవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణ నాయకులు మాట్లాడుతూ…రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి కెసీఆర్, కేటీఆర్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సేవలు వినియోగించుకుని ఎన్నికల అనంతరం పక్కకు నెట్టడం వల్ల పలుమార్లు ఆయన అభిమానులు బీఆర్ఎస్ పార్టీపై అసహనం వ్యక్తం చేసినా కార్యకర్తలకు సర్దిచెప్పి ఒప్పించారే తప్ప ఏనాడూ పార్టీ గీత దాటలేదని అన్నారు. పార్టీలోని కొందరు పెద్దలు పలుమార్లు విమర్శలు చేస్తున్నా వారిని అధిష్టానం హెచ్చరించకపోగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీనుంచి సస్పెండ్ చేయడం లాంటి అనైతిక చర్యలవల్ల మనస్థాపానికి గురయ్యామని మా నాయకుడు పొంగులేటికి మద్దతుగా ఇల్లందు పట్టణంలోని 24వార్డులకు చెందిన కోరం ముఖ్య నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు ప్రకటించడం జరిగిందని వారు తెలిపారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తూ, రాక్షస పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగులేటికి ఉమ్మడి జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగానూ అభిమానులున్నారు అని రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గద్దె దించటం ఖాయమని పేర్కొన్నారు. అదేవిధంగా జెడ్పీ ఛైర్మెన్ కోరం కనకయ్యపై, పొంగులేటి శ్రీనన్నలపై అవాకులు, చవాకులు పేలితే సహించబోమని ఇంకోసారి ఇటువంటి అసత్య ప్రేలాపనలు చేస్తే ప్రజలే మిమ్మల్ని రోడ్లపై ఉరికించి తరిమికొడతారని హెచ్చరించారు. ఈ సందర్భంగా రాజీనామాలు చేసిన వారిలో పట్టణ నాయకులు మడుగు సాంబమూర్తి, బోల్ల సూర్యం, చిల్ల శ్రీనివాసరావు, నందకిషోర్, పత్తి రంజిత్, పెద్దినేని హరినాథ్ బాబు, పూనం సింగ్, మంగళ్ సింగ్, అయితా సత్యం, పెండ్యాల రాజు, బొల్లి రాజు, శివరాత్రి ఎల్లయ్య, రామ్ రెడ్డి, మహమ్మద్, మున్న, మహిముద్, వెంకన్న, ఎలమందరావు, నీలపు రమేష్, కౌశిక్, దుర్గ, ఎల్లయ్య, మల్లయ్య, భరత్, సిహెచ్ రమేష్, వీరస్వామి, వెంకటేశ్వర్లు, సంతోష్ పాసి, శ్రీనివాస్, కుంట రాజు మరియు వార్డుల ప్రజలు, అభిమానులు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.