మన్యంన్యూస్,ఇల్లందు..ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల ఇల్లందు శాసనసభ్యురాలు భానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్న సమయంలో వూహించని రీతిలో సిలిండర్లు పేలి ఇద్దరు కార్యకర్తలు మరణించడం, అదేవిధంగా పలువురు తీవ్రగాయాల పాలవ్వడం బాధాకరమన్నారు.ఈ విషయం జరిగిన వెంటనే బీఆర్ఎస్ ప్రభుత్వం మరణించిన వారికి 10 లక్షలు, క్షతగాత్రులకు 2లక్షల చొప్పున పరిహారం ప్రకటించటం అభినందనీయం అని పేర్కొన్నారు. బాధితులకు ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సంఘటన జరిగిన వెంటనే క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఇల్లందు శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ జిల్లా వైద్య అధికారులకు ఆదేశించారు.
