మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆర్మడ్ రిజర్వ్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ బాలాజి కుటుంబానికి 16,00,000/-ల రూపాయల భద్రతా ఎక్స్గ్రేషియా నగదును సుజాత నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ ఇటీవల అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ ముత్తయ్య కుటుంబానికి చేయూత ఫండ్ లక్ష రూపాయల నగదును చెక్కుల రూపంలో బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డా.వినీత్ అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్,పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు,జూనియర్ అసిస్టెంట్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.