మన్యం న్యూస్,ఇల్లందు టౌన్.. ఈనెల 16 నుంచి 18 వరకు తిరుపతిలో జరుగు ఐఎఫ్టియు అఖిలభారత ఏడవ మహాసభలను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు తోడేటి నాగేశ్వరరావు, కొక్కు సారంగపాణిలు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఇల్లెందు మున్సిపాలిటీ, సిఎస్ప కోల్ ట్రాన్స్ పోర్ట్, హమాలి అడ్డాల వద్ద తిరుపతిలో జరిగే మహాసభల పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ… ఏప్రిల్ 16న తిరుపతి నగరంలో వేలాదిమంది కార్మికులతో భారీ ప్రదర్శన, అదేవిధంగా 17,18 తేదీలలో దేశవ్యాప్తంగా ఎంపిక కాబడిన ప్రతినిధులచే మహా బహిరంగసభ జరుగుతుందని తెలిపారు. ఈ మహాసభలకు అన్ని రంగాల కార్మికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు ఇల్లెందు ఏరియా కమిటీ అధ్యక్షులు డి.మోహన్ రావు, నాయకులు పల్లి సుధాకర్, మోరే వెంకటేశ్వర్లు, ఎండి. సలీం, రమేష్, శ్యామ్, రామస్వామి, నాగరాజు, బాలు, రమేష్, విజయ్ వెంకన్న, కృష్ణ, సంధ్య, భారతమ్మ, కుమార్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.