మన్యం న్యూస్, మంగపేట.
జగ్గారం గ్రామం పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కర్రీ ప్రేమ్ రాహుల్ 6 సంవత్సరాలు, తండ్రి కర్రీ సారయ్య
కొన్ని రోజుల క్రితం వీధి కుక్కలు రాహుల్ ను బాగా కరిచాయి.
భద్రాచలం హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నారు.
కర్రీ రాహుల్ తండ్రి కి గత 10 సంవత్సరాలు క్రితం ఆక్సిడెంట్ అయి ఒక కాలు సర్జరీ అయింది. కుటుంబ పోషణ చాలా ఇబ్బంది గా మారింది.
హాస్పిటల్ ఖర్చులకు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు. తెలిసిన వారి ద్వారా ఈ కుటుంబం జ్వాలా యూత్ ని ఆశ్రయించడం జరిగింది. వీరు సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ ల ధ్వారా అందరికీ తెలియపరిచి దాతల సహకారంతో 10 వేల రూపాయలు సేకరించి ఈ కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా సహాయం అందుకున్న కుటుంబం మాట్లాడుతు దాతలసహకారం మరువలేనిది. మీరు చేసే సహాయం మరల ఆ దేవుడు మీకు ఏదోఒక రకంగా మీ అందరికి సహాయం చేస్తాడు.ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం చాలా మంచి కార్యక్రమం అని ఇటువంటి వారికీ ప్రతి ఒక్కరు చేయూత నివ్వండి అంటూ కోరారు.ఈ కార్యక్రమంలో జ్వాలా యూత్,ట్రస్ట్ అధ్యక్షులు కోడెల నరేష్ ,ఉపాధ్యాక్షులు కస్పా ముకుందం, కార్యదర్శి ఆత్మకూరి సతీశ్,జ్వాలా యూత్, ట్రస్ట్ సభ్యులు చిక్కుల శ్రీకాంత్ , కర్రీ రామ్మోహన్, తదితర సభ్యులు పాల్గొన్నారు.
