మన్యం న్యూస్ గుండాల*: ఖమ్మం జిల్లా సింగరేణి మండలం చీమలపాడు గ్రామంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ప్రాణాలు కోల్పోయి గాయాలు పాలైన బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని న్యూ డెమోక్రసీ నాయకులు జెడ్పిటిసి రామక్క, ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల సర్పంచ్ సీతారాములు కోరారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చనిపోయిన వారికి నష్టపరిహారం కింద రూ.50 లక్షలు గాయపడిన వారికిరూ. 25 లక్షల రూపాయలను ఇవ్వాలని కోరారు. గాయపడిన వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని అన్నారు.
