మన్యం న్యూస్ గుండాల: తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ఎందరినుండు ప్రశంసలను పొందుతుంది. మండల కేంద్రంలో నీ పాలకుర్తి వీరలక్ష్మి, ఉపేందర్ అక్క తమ్ముడికి అంగవైకల్యం ఉండడంతో కంటి వెలుగు సిబ్బంది శిరీష వారి ఇంటి వద్దకు వచ్చి కంటి పరీక్షలను నిర్వహించారు. వారికి పరీక్షల అనంతరం పర్సంటేజ్ ఎక్కువ ఉన్నందున నెల రోజుల్లోపు వారికి సరిపడా కళ్లద్దాలను ఇవ్వనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నవ చైతన్య యూత్ నాయకులు ఆజాద్ పాల్గొన్నారు.
