- కోట్లకు పడగలెత్తిన కల్తీ మద్యం వ్యాపారం
- ఆమ్యామ్యాలతో అధికారులు మౌనమా…?
- ములుగు జిల్లాలో మద్యం జోరు ఆగేది ఎన్నడు..?
- చిద్రమవుతున్న అనేక కుటుంబాలు
- కల్తీ మద్యం నియంత్రణ కష్టమేనా..?
- హరించకపోతున్న అనేక ప్రాణాలు.
మన్యం న్యూస్ నూగూర్ వెంకటాపురం .
కల్తి మద్యం వ్యాపారం ఇక్కడ కోట్లకు పడగ లెత్తింది. కల్తీ మద్యం సేవించి అనేకమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారనేది ఎవరికి అర్థం కావడం లేదు. అమ్యమ్యాలతో అధికారులు అంత గప్.. చుప్. ఈ కల్తీ మద్యం నియంత్రణ లేకపోవడంతో అనేక కుటుంబాలు వీధి పాలవుతున్నాయి. ఈమధ్యం మీద మన్ను పడ అంటూ మహిళలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది
తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలు వెంకటాపురం వాజేడు కన్నయ్య గూడెం మంగపేట మండలాల ప్రజల ప్రాణాలు హరించే కల్తీ మద్యం తయారవుతూ ఆయా గ్రామాలలో రాజమేలుతున్నాయి, వైన్ షాపుల యాజమాన్యాలే తయారు చేస్తున్నారు. అని ఆరోపణలు వెళ్లివె తున్నాయి.అలాగే ఎంతో చాకచక్యంగా సీసా గుర్తుపట్టకుండా దానికి స్టిక్కరింగ్ వేసి ప్రభుత్వం తయారు చేసినట్లు ఆ సీసా ని తయారు చేయడంలో నిష్ణాతులుగా వారి నైపుణ్యానికి
క నుమరుస్తున్నారు. ఇదే అదునుగా అక్రమ సిండికేట్లు అధిక రేట్లకు మద్యాన్ని అమ్మి కోట్లాది రూపాయలు సొమ్ము స్వాహా చేస్తున్నారు. ప్రజలు కల్తీ మద్యం సేవించి తిరిగిరాని లోకానికి వెళ్ళిపోతున్నారు. అసలే బడుగు బలహీన వర్గాలు పేదరికం రే కార్డితే డొక్కాడని బ్రతుకులు దీనికి తోడు కల్తీ మందు. వారిని ఎంతో కృంగదీస్తున్నాయి. ఎన్నిసార్లు మన్యం పత్రిక ప్రతినిధులు దీని గురించి రాసిన,పై అధికారులకు చెవి మీద పేను పారినట్టు గా కూడా లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ప్రజలు ఈ విషయాల పట్ల తీవ్ర అసంతృప్తి కనపరుస్తూ న్నారు. అసలే రోజు కూలి చేసే తామ భర్తలు పొద్దుందాక పని చేసి సాయంత్రం వచ్చి ఈ కల్తీ మందు తాగి తీవ్ర అస్వస్థకు అనారోగ్యానికి గురవుతున్నారని వారు తెలియజేస్తున్నారు. మరికొంతమంది మందు తాగి చనిపోయారని గ్రామ స్త్రీలు తెలియజేస్తున్నారు. చాలా కాలం నుంచి ఇలానే జరుగుతున్నాయని తమ ప్రాణాలు పోయినా కూడా ప్రభుత్వ పై అధికారులు నిర్లక్ష్య ధోరణి చూపిస్తున్నారని. కనీసం ఈ కల్తీ మందు ఆగేలా అక్రమ సిండికేట్ వ్యాపారుల మీద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తమ భర్తలతో నలిగిపోతున్న బడుగు బలహీన వర్గాల స్త్రీల పత్రిక ముఖంగా తెలియజేస్తున్నారు.
ఇంకా దారుణమైన పరిస్థితులు వారి వారి కుటుంబాలలో జరుగుతున్నట్టు ప్రజలు వారి ఆవేదనని వెళ్లబుచ్చుతున్నారు. అసలే భర్తలు తాగి గొడవలు పెడుతూ ఉంటే ఇప్పుడు తమ పిల్లలు కూడా అదే మందుకు బానిసలై స్కూళ్లకు బడులకు కూడా పోకుండా తప్పు త్రోవ పడుతున్నారని గ్రామ ప్రజలు ప్రభుత్వం అధికారులపై ధ్వజమెత్తుతున్నారు. నవభారతం అంటే పుస్తకాలతో కుస్తీ పడుతూ ముందుకు వెళ్లడమే అనుకున్నాము కానీ తమ పిల్లలు మందు సీసాలతో ఆగమనం అవుతున్నారు. అనుకోలేదని. ఇంకా కొసమెరుపు ప్రభుత్వం ద్వారా మద్యం దుకాణాలు పొందిన వారు వారి లాభం కోసం నకిలీ మద్యాన్ని చతిస్గఢ్ అడవిలో తయారు చేసుకొని వాటిని అమ్ముతూ కోట్ల రూపాయలు సొమ్ము స్వాహా చేస్తున్నారు. అని దానివల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారనని .
అక్రమ సంపాదన కోసం ఈ దురాగతానికి పాల్పడుతూనే ఉన్నారు. అని కేవలం వ్యవసాయ కూలీలే కాకుండా కొంచెం డబ్బులు ఉన్నవారు కూడా ఈ కల్తీ మద్యం సేవించి అనారోగ్యం పాలై ఆసుపత్రులచుట్టూ తిరిగి తిరిగి డబ్బులు అవ్వ చేసుకొని చివరికి తుది శ్వాస విడుస్తున్నటూ . ఇదంతా మండలాల ఎక్సైజ్ ఆఫీసర్లకు సిఐ లకు ఎస్ఐలకు అందరికీ తెలిసిన.సెరా మామూలుగా మందు దుకాణాలు రోజురోజుకు ఉద్భవించి ఉప్ అధికారుల ధన దాహం ఏంటో తెలుస్తుంది . అని ప్రజలు బహిరంగంగానే వారి మనోవేదనని వెళ్లబుచ్చుతున్నారు
ధన దాహం ముసుగులో ప్రజలని మద్యం నుంచి కాపాడే వారి విధులను మర్చిపోయారా?? ఏజెన్సీ గ్రామ ప్రజలు అంటే లెక్క లేదా???. పే సా చట్టాల ప్రకారం ఏజెన్సీలో గిరిజనులు మాత్రమే అన్ని దుకాణాలు పెట్టుకోవడానికి అర్హుడు అయితే ఈ దుకాణాలు గిరిజనుల పేరు మీద తీసుకొని కొంతమంది డబ్బున్న బాబులు గిరిజనుల పేరు పెట్టి వారు యదేచ్చగా ఈ దందాను నడుపుతున్నట్టుగా ఆయా మండలాల ప్రజలు తెలియజేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు ఈ విషయం పట్ల చొరవ తీసుకొని మద్యం సిండికేట్ దారులను ఆపే విధంగా వారు చర్యలు తీసుకోవాలని మహిళా లోకం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు