మన్యం న్యూస్ చండ్రుగొండ,ఏప్రిల్ 12: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యాను ను అదుపులోకి తీసుకొన్నట్లు ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి తెలిపారు. బుధవారం సీతాయిగూడెం క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా రామవరం నుంచి కాకినాడకు వ్యాన్లో తరలిస్తున్న 33 క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ…పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేయటం జరిగిందన్నారు. గ్రామాల్లో రేషన్ బియ్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఆమె వెంట పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.