మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
రేపు జరిగే ప్రజా చైతన్య యాత్రను జయప్రదం చేయాలని సి.పి.ఐ.నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ రావులపల్లి రవికుమార్ తెలిపారు అనంతరం ఆయన చేతుల మీదుగా చైతన్య యాత్ర గోడ పత్రికలను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చర్ల మండలం నుండి జన చైతన్య యాత్ర ప్రారంభం అవుతుందని మధ్యాహ్నం దుమ్మగూడెం మండలం నుండి భద్రాచలం వైపుగా యాత్ర సాగుతుందని ఈ యాత్రలో సి.పి.ఐ. నాయకులు పార్టీ కార్యకర్తలు కార్మికులు కర్షకులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు కుంజ శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు నోముల రామి రెడ్డి, మండల సహాయ కార్యదర్శి తాటిపూడి రమేష్, రైతు సంఘం నాయకులు బొల్లోజు వేణు,సొసైటీ డైరెక్టర్ పాయిం చలపతి, తామ చిన్న ముత్తయ్య పాల్గొన్నారు