. మన్యం న్యూస్ వాజేడు.
మండలంలో ఎడుజర్లపల్లి గ్రామపంచాయతీలో పలు గ్రామాలు ముత్తారం, ముత్తారం కాలనీ, కొత్తూరు, గ్రామాలలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ వాసం మల్లేశ్వరి ప్రారంభించారు. కంటి వెలుగు పథకం ద్వారా ప్రతి పల్లెకు కంటి పరీక్ష నిపుణులు ద్వారా పరీక్షలు చేసి చూపులో ఇబ్బంది ఉన్నవారికి కళ్ళజోళ్ళు ఇచ్చే అద్భుతమైన కార్యక్రమం మన కంటి వెలుగు పథకం అని సర్పంచ్ అన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్విని యోగం చేసుకోవాలని, కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, జిల్లా ఎల్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ మంచిడి వెంకటేశ్వర్లు, వైద్య అధికారులు మహేందర్, మధుకర్, వైద్య సిబ్బంది కోటిరెడ్డి, శ్రీనివాస్, ప్రశాంత్, రాహుల్, కన్యాకుమారి, ఆశ, కార్యకర్తలను అంగన్వాడి, టీచర్లు పాల్గొన్నారు.
