మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథులుగా జిల్లా మహిళా అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి, మండల ఇంచార్జ్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య హాజరు అయ్యారు. కాంగ్రెస్ కార్యకర్త ల ఆమోదంతో మండల అధ్యక్షురాలుగా నిర్మల ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షురాలుగా తక్కులపల్లి లక్ష్మి, కొమరం సుశీల
ప్రధాన కార్యదర్శిగా చింత చంద్రావతి, కార్యదర్శిగా సయ్యద్ రేష్మ ,సహాయ కార్యదర్శిగా చదలవాడ లక్ష్మి,ప్రచార కార్యదర్శిగాఈసం సరిత,కోశాధికారిగా
బేత తిరుపతమ్మ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది నరసింహారావు, మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మహబూబ్ ఖాన్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి కారుపోతుల నరసయ్య గౌడ్, బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు చాద మల్లన్న, మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు టీవీ హిధైతుల, సీనియర్ నాయకులు తుడి భగవాన్ రెడ్డి, పోడేం నగేష్ తదితరులు హాజరయ్యారు.
