- ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి ఇఫ్తార్ విందు…_
- ముస్లిం సోదరులకు షాదిఖానా కొరకు 30 కుంటల స్థలం కేటాయింపు
- ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్
మన్యం న్యూస్,ఇల్లందు టౌన్.. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నియమ నిష్ఠలతో నిర్వహించుకునే ఉపవాస దినాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు గురువారం ఇల్లందు పట్టణంలోని స్థానిక జమా మసీదు వద్ద ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది.. ఇల్లందు తహాసిల్దార్ కృష్ణవేణి అధ్యక్షతన జరిగిన ఈ యొక్క కార్యక్రమానికి ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజల పండుగలు ఎంతో అంగరంగ వైభవంగా అట్టహాసంగా జరుగుతున్నాయని అందులో భాగంగానే ముస్లిం సోదర, సోదరీమణులు ఎంతో ఘనంగా నిర్వహించుకునే ఉపవాస దినాలలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు అందించాలని ఆదేశాలు జారీ చేయటంతో ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయటం జరిగిందని పేర్కొన్నారు. అంతేకాకుండా షాది ముబారక్ ద్వారా ఇప్పటికే ముస్లిం సోదర కుటుంబాలకు చేయూతని అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు మన ఇల్లందులోని ముస్లిం సోదర సోదరీమణులకు షాదిఖానా ఏర్పాటు కొరకు 30 కుంటల స్థలాన్ని కేటాయించడం జరిగిందని ఈ రంజాన్ పండుగ పర్వదినం లోపు ఆ స్థలానికి సంబంధించిన దస్తావేజులు ఇల్లందు తహసిల్దార్ కృష్ణవేణి పంచనామా చేసి అందజేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ ఛైర్మెన్ డీవీ, టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు రంగనాథ్, తహసిల్దార్ కృష్ణవేణి, కౌన్సిలర్ సయ్యద్ ఆజం, సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారపు రాజేష్, అధికార ప్రతినిధి కుంట నవాబు, ముస్లిం మతపెద్దలు తదితరులు పాల్గొన్నారు.