మన్యం న్యూస్ కరకగూడెం: నేటి నుంచి మే 14 వరకు జరిగే సిపిఐ పార్టీ ప్రజాపోరు యాత్రను జయప్రదం చేయాలని సిపిఐ మండల కార్యదర్శి వంగరి సతీష్ అన్నారు. ఆయన గురువారం మన్యం న్యూస్ తో మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దేశ సమగ్రత,సమైక్యతకోసం, ప్రభుత్వాల హామీల అమలకై జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన సిపిఐ పార్టీ ప్రజాపోరు యాత్ర నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ప్రారంభమై 20వ తారీకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైల్వే స్టేషన్ సెంటర్లో కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు.
