UPDATES  

 కొత్తగూడెం గణేష్ బార్ లో ఘటన త్రీ టౌన్ పోలీసులు రంగ ప్రవేశం

  • అమ్మో తాగుబోతులు..
  • సినిమా పక్కిలో డిష్యుం డిష్యుం
  • కొత్తగూడెం గణేష్ బార్ లో ఘటన
  • త్రీ టౌన్ పోలీసులు రంగ ప్రవేశం

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
మద్యం మత్తులో విచక్షణ జ్ఞానాన్ని మరిచి వికృత రూపాన్ని ధరించి ఇష్టం వచ్చిన రీతిలో సంబంధిత బార్ షాప్ సిబ్బందితో మందుబాబులు సృష్టించిన వీరంగం ఓ సినిమాలో ఫైటింగ్ మాదిరిగా తలపించింది. కుర్చీలను పగలగొడుతూ బీరు బాటిల్ను మనుషుల వైపుకు విసురుతూ కొంతమంది యువకులు సృష్టించిన వీరంగం గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం పట్టణ సూపర్ సెంటర్లో ఉన్న గణేష్ బార్ లో చోటుచేసుకుంది. కొంతమంది యువకులు మద్యం సేవించేందుకు గణేష్ బార్ కు వచ్చారు. ఏమైందో ఏమో తెలియదు గానీ బార్ షాప్ సిబ్బందికి మందు బాబులకు మధ్య కొంత వివాదం చోటు చేసుకుంది. దీంతో మద్యం సేవించిన యువకులు వీరంగం సృష్టిస్తూ బీరు బాటిల్లను గాలిలో విసురుతూ బార్ షాప్ సిబ్బందిపై తిరగబడటమే కాకుండా భయానక వాతావరణాన్ని సృష్టించారు. బార్ షాప్ లోని సీసాలను పగలగొడుతూ కుర్చీలను విరగగొడుతూ బార్ షాప్ సిబ్బందిపై తిరగబడటంతో మద్యం సేవించి ఎందుకు వచ్చిన కొంతమంది మందుబాబులకు తీవ్ర ఆటంకం కలిగింది. గాల్లోకి విసిరిన బీరు బాటిళ్లు పగిలి ఆ బార్ షాపులో మద్యం సేవించే పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బార్ షాపులో యువకులు సృష్టించిన వీరంగం పెద్ద ఎత్తున సంచలనాన్ని రేపింది. మద్యం మత్తులో యువకులు చేసిన ఈ వీరంగం వలన ఎవరికి ప్రాణప్రాయం ఉన్నదనేది భయం గుప్పెట్లో ప్రజలు వణికిపోయారు. సంవత్సరం తెలుసుకున్న త్రీ టౌన్ సీఐ అబ్బయ్య హుటాహుటిన గణేష్ బార్ కు చేరుకొని సంబంధిత సంఘటనపై వివరాలను సేకరించారు. ఇది ఇలా ఉంటే బార్ షాపులో మద్యం సేవించి బిల్లులు అడిగినందుకు ఇష్టం వచ్చిన రీతిలో తమపై దాడికి దిగారని బార్ షాప్ సిబ్బంది పేర్కొన్నారు. ఈ విషయంలో పోలీసులు ఏ మేరకు విచారణ చేపట్టి తగు చర్యలకు పూనుకుంటారనేది ప్రతి ఒక్కరు విశ్వసిస్తున్నారు. భయానక వాతావరణాన్ని సృష్టించిన మందుబాబుల వీరంగం బార్ షాపులో ఉన్న సిసి ఫుటేజ్ ల ద్వారా పరిశీలిస్తే తప్ప తగు చర్యలకు పోలీసులు కృషి చేస్తారనేది ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !