- తునికాకు బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు….?
- టిడిపి నియోజకవర్గ సమన్వయకర్త చందా మధు
- తునికాకు కట్టకు 3.50 పైసలు చెల్లించాలి
మన్యం న్యూస్ కరకగూడెం: గత సంవత్సరం ఎండలను సైతం లెక్కచేయకుండా సేకరణ చేసిన ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఇప్పటివరకు బకాయిలు చెల్లించలేదని పినపాక నియోజకవర్గం టిడిపి సమన్వయకర్త చందా మధు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరకగూడెం మండలంలో తునికాకు సేకరణ ఏ బి యూనిట్లగా చేసి సేకరించిన సునీతకు పైసలు ఈరోజు వరకు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో వడదెబ్బ లెక్క చేయకుండా ఆదివాసీలు ఒక పంటగా భావించి ఎంతో ఆనందంగా తునికాకు కోస్తారని ఆయన అన్నారు.వ్యయ ప్రయాసలు కూర్చి సేకరిస్తున్నా తునికాకు పైసలు ఈరోజు వరకు అందడం లేదని ఫారెస్ట్ అధికారులు కాంట్రాక్టర్లు దీనిపై స్పందించడం లేదని తక్షణమే అధికారులు మండల వ్యాప్తంగా డబ్బులు అందని కూలీలను గుర్తించి తక్షణమే డబ్బులు అందే విధంగా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. 2023 సంవత్సరంలో తునికాకు కట్ట ధర 3.50 పైసలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజలందరూ సంఘటితమై తునికాకు సేకరణ బందు పెడతామని ఆయన తెలిపారు. తునికాకు సేకరించే వారికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వడదెబ్బ గురికాకుండా కాంట్రాక్టర్లు కల్లేదారులు ఫారెస్టు అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.