- నాణ్యత నా… నవ్విపోదురు గాక
- గ్రామాల అభివృద్ధికి రహదారుల నిర్మాణాలు
- కొరవడిన అధికారుల పర్యవేక్షణ
- ఒకే ఒక గుత్తేదారునికి సీసీ రహదారుల నిర్మాణాలు
- ఆంతర్యం ఏమిటో.. అర్థం కాని పరిస్థితి
.మన్యం న్యూస్ వాజేడు.
మండలంలో రహదారుల అర్థం కాని పరిస్థితి నిర్మాణం గ్రామాలు అభివృద్ధి సాధించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.గ్రామాలలో పలు కులాల వారు ఉత్పత్తి చేసిన పలు రకాల వస్తువులని, పరికరాలని, రైతులు పండించిన పంటలను మార్కెట్లో విక్రయించేందుకు, గ్రామాలలో రహదారులు నిత్యం అవసరం, గ్రామాలు భౌతికంగా అభివృద్ధి చెందాలన్నా, రహదారి సౌకర్యం ఉండడం వల్ల కలిగే ఉపయోగాలు గ్రామ అభివృద్ధికి దోహదపడుతుంది. ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం ఉండాలని, ప్రభుత్వం పల్లెల్లో ప్రతి గల్లీకి సీసీ రహదారుల నిర్మాణాలు మంజూరు చేసింది.
ములుగు జిల్లా వాజేడు మండలంలో పల్లెల్లో ప్రతి గల్లీకి ఒక సీసీ రహదారి నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో సిసి రోడ్ల నిర్మాణంలో నాణ్యత లోపంతో నిర్వహణ చేపడుతూ, మురుమూరు గ్రామపంచాయతీ పరిధిలోని అరుణాచలం గ్రామంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల రోడ్డుకు అడ్డంగా ఉన్న కరెంట్ పోల్ సైతం రోడ్డు లో కలిపి వేసేశారని, దాన్ని చూసిన వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు, కరెంటు స్తంభం రహదారి కి మధ్యలో అడ్డుగా ఉందని, కరెంట్ స్తంభాన్ని తీసివేయవలసిఉండగా, సీసీ రహదారిలో కలిపి వేశారు. ఈ సంఘటన చూసిన ప్రజలు ప్రభుత్వ ధనాన్ని కూని చేస్తున్నారనే సంకేతాలకు అద్దం పడుతుందని ఆరోపిస్తున్నారు.మండలంలో 22 సిసి రోడ్లు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి 2, కోట్ల 20, లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి మండలంలో నిర్మించిన సీసీ రోడ్డుకు ఇరువైపులా సైడ్ గ్రావెల్ పోయాల్సి ఉండగా! ఏ ఒక్క సీసీ రహదారి పూర్తి చేసిన దానికి గ్రావెల్ పోయకుండా కాంట్రాక్టర్ చేతులు దులుపుకున్నాడనీ, ఇదేంటని ప్రశ్నించిన వారికి ఎస్టిమేషన్లో లేదు అని దురుసుగా సమాధానం చెప్పడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిసి రోడ్లన్నీ గ్రామపంచాయతీ సర్పంచులకు అప్పచెప్పారు కానీ…. ఏజెన్సీ ప్రాంతంలో ఒక గుత్తేదారునికి అప్పజెప్పడం పలు అనుమానాలకు తావు ఇస్తుంది. 22, సి సి రహదారులు కూడా ముందస్తుగా ఎంబి రికార్డ్ చేసి బిల్లులు చెల్లించినట్టుగా మండల వాసులు ఆరోపిస్తున్నారు. దీన్ని అదునుగా తీసుకొని సంబంధిత గుత్తేదారుడు నాసిరకంగా నిర్మిస్తూ మండలంలో ఎక్కడ చూసినా నాసిరకం ఇసుక నాసిరకం చిప్స్ ,నాసిరకం సిమెంటు, వేసి రోడ్డు నిర్మిస్తున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు.
సిసి రహదారుల నిర్మాణ క్రమం,
మొదటగా సిసి రోడ్డు వేయక ముందు ఉన్న రోడ్డును సమానంగా బ్లేడ్ ట్రాక్టర్ తో లెవెలింగ్ చేయాలి, ఆ తర్వాత 12 ఎమ్ ఎమ్, చిప్స్, నాలుగు అంగుళాల మందంతో పోయాలి, పోసిన తర్వాత పాలదిన్ కవర్లు పరిసి అందులో 8 ఇంచుల తో సిసి పోయాలి కానీ ఈ విధానానికి విరుద్ధంగా జరుగుతుందని, ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 1/70 యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు కలిసి ఒక గిరిజనేతరుడి కి అప్పగించడం పట్ల ప్రజా సంఘాలు గిరిజన సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.