మణుగూరు పివి కాలనీ, అంబేద్కర్ పార్క్ వద్ద సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 వ తేదీన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించబడుతుందని, ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ తెలిపారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,భారత రత్న, బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని,ఉదయం 10 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది అన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు సమర్పించి,ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది అన్నారు. అనంతరం అంబేద్కర్ గొప్పతనం పై వక్తల స్ఫూర్తి దాయక ప్రసంగాలు ఉంటాయి అని తెలిపారు.అలాగే ఉత్తమ సామాజిక సేవకులకు,స్వయం కృషితో ఉన్నత స్థాయికి చేరిన అభ్యర్ధులకు సన్మానం కార్యక్రమం కూడా ఉంటుంది అన్నారు.సింగరేణియులు అధిక సంఖ్యలో పాల్గోని, అంబేద్కర్ జయంతి మహోత్సవాన్ని విజయవంతం చేయాలని,అందరినీ ఆహ్వానిస్తున్నామని ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్ తెలియజేశారు.