మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్ 13: భర్త వేధింపులపై గురువారం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆసుపాక గ్రామానికి చెందిన భూక్యా కనకారావు కు అనంతారం కి చెందిన మమతతో పది ఏళ్ల క్రితం వివాహమైంది. తనను భర్త రోజు తాగుతూ, జూదం కి బానిసై తనను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు భర్తపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేష్ కుమార్ తెలిపారు.