మన్యం న్యూస్ మణుగూరు: ఏప్రిల్ 13
మణుగూరు మండలంలోని కూనవరం గ్రామపంచాయతీ పరిధిలోని వజ్జ వారి గుంపులో మండల ప్రజా పరిషత్ నిధుల నుంచి రూ.3 లక్షల రూపాయల తో డ్రైనేజీ నిర్మాణ పనులకు గురువారం ఎంపీపీ కారం విజయ కుమారి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం.నరసింహారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,రానున్న వర్షాకాలం నేపథ్యంలో డ్రైనేజీ నిర్మాణ పనులు వేగవంతం చేసినట్లు తెలిపారు.బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మారుమూల ప్రాంతాలలో కూడా డ్రైనేజీ నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.ఈ కార్యక్రమంలో ,ఎండిఓ వీరబాబు,ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఏనిక ప్రసాద్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, పార్టీ నాయకులు,మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.