మన్యం న్యూస్ గుండాల… బడుగు బలహీన వర్గాల నేత రేగన్న అని సంక్షేమ సారధి వెంటే నడుస్తామని ఆళ్లపల్లి మండలం వలసల్ల గ్రామ ప్రజలు పేర్కొన్నారు. గురువారం ఉమ్మడిగుండాల మండల పిఎసిఎస్ చైర్మన్ రామయ్య సమక్షంలో పలు కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఉమ్మడి గుండాల మండలాన్ని రేగా కాంతారావు అభివృద్ధిలో సంక్షేమంలో ముందు అడుగులో నిలుపుతున్నారని అన్నారు. గతంలో లేని విధంగా నిధులను తీసుకువచ్చి అభివృద్ధిని ప్రజలకు చేరువ చేశారని పేర్కొన్నారు. సంక్షేమ సారధి పక్కనే నడుస్తూ పార్టీని ప్రజల్లోకి మరింత తీసుకు వెళ్లే విధంగా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, పిఎసిఎస్ డైరెక్టర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
