మన్యం న్యూస్ గుండాల..: ఐ ఎఫ్ టి యు ఏడవ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో నాయకులు ప్రచారం నిర్వహించి పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం సంఘ అధ్యక్షులు ఎనగంటి రమేష్, కార్యదర్శి యాసారపు వెంకన్న మాట్లాడుతూ ఈనెల 16, 17, 18 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి నగరంలో మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆయన వారు పేర్కొన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు కార్మిక హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలపై కథన బేరి తొక్కలని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చే కార్మిక వ్యతిరేక చట్టాలను ఉద్యమాలతోనే ఎదుర్కొనాలని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు గడ్డం నగేష్, కిరణ్, కవిత, పాపమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు
