అవ్వ ఆరోగ్యం ఎలా ఉంది.. భయమెందుకు
నేను విన్నాను,నేనున్నాను:
రోగులకు విప్ రేగా భరోసా
మణుగూరు వంద పడకల ఆసుపత్రిని సందర్శించిన ప్రభుత్వ విప్,రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు టౌన్: ఏప్రిల్ 13 మణుగూరు మండలంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సందర్శించారు.ఈ సందర్భంగా ఆస్పత్రిలోని వార్డులను సందర్శించి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి,అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అవ్వ ఆరోగ్యం ఎలా ఉందంటూ రోగులను ఆప్యాయంగా పలకరించారు. నేను విన్నాను,నేను ఉన్నాను అంటూ రోగులకు భరోసా కల్పించారు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్ద పీట వేసింది అన్నారు.ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యాధునిక పరికరాలతో ఎంతో మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నారని తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రు లలో మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగింది అన్నారు. రోజు వారి ఓ పి,నార్మల్ డెలివరీ కేసులే ఇందుకు నిదర్శనం అన్నారు.పేద మధ్య తరగతి ప్రజలకు ఈ వైద్య సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అన్నారు.ప్రజల ఆరోగ్యమే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు.అనంతరం ఆస్పత్రి డాక్టర్ లు,సిబ్బంది తో వారు మాట్లాడారు,ఆస్పత్రిలో ఇంకా కావాల్సిన వసతులపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తామని విప్ రేగా కాంతరావు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో మండల ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,సీనియర్ నాయకులు వట్టం రాంబాబు, యాదగిరి గౌడ్,తాతా రమణ, తిరుమలరావు,బాబి జాన్, రామారావు యువజన నాయకులు రవి ప్రసాద్,హర్ష నాయుడు,సృజన్, డాక్టర్లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.